![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -151 లో.. సందీప్ ఇంటర్వ్యూకి వెళ్లి సెలక్ట్ అయి ఉంటాడని శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అవుతు తన కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే సందీప్ రావడం చూసి తనకి హారతి తీసుకొని వచ్చి.. జనరల్ మ్యానేజర్ అంటూ సందీప్ అని అసలు ఏం జరిగిందో కూడా చెప్పనివ్వదు. అప్పుడు శ్రీలత వచ్చి హారతి కిందపడేస్తుంది. అక్కడ జరిగింది వేరే అని శ్రీలత అంటుంది. వీడు సెలక్ట్ అయ్యాక రామలక్ష్మి ఇంటర్వ్యూకి వెళ్లి తను సెలక్ట్ అయిందని శ్రీలత చెప్తుంది.
దాంతో పెద్దాయన, సిరి, ధనలు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ జాబ్ కి సందీప్ కంటే రామలక్ష్మి పర్ ఫెక్ట్ అని పెద్దాయన అంటాడు. ఇక ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారని సిరి అంటుంది. అప్పుడే సీతాకాంత్ రామలక్ష్మిలు వస్తారు. పడిపోయి ఉన్న హారతి చూసి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు సీతా.. నీకు ఏ లోటు లేకుండా పెంచాను. నీ తమ్ముడికి ఒక దారి చూపిస్తావనుకుంటే, నువ్వు నీ భార్యకి జాబ్ ఇచ్చావని శ్రీలత కోపంగా మాట్లాడుతుంది. అదేం లేదు అమ్మ.. తను బాగా చెప్పింది కాబట్టి సెలక్ట్ అయిందని సీతాకాంత్ అంటాడు. ముందే పేపర్ లీక్ చేసి ఉంటారని శ్రీవల్లి అనగానే సీతాకాంత్ తనపై కోప్పడతాడు. అమ్మ నీ సంతోషం కోసం ఏది చేయమన్నా చేస్తానని సీతాకాంత్ అంటాడు. ఏది చేయమన్న చేస్తావా అయితే మాట ఇవ్వమని శ్రీలత అంటుంది. సీతాకాంత్ మాట ఇస్తుంటే.. ఆగండి అని రామలక్ష్మి అంటుంది. నా వల్లే ఇదంతా కదా ఈ జాబ్ కి నేను రిజైన్ చేస్తున్నా అని రామలక్ష్మి ఒక పేపర్ పై రాసి ఇస్తుంది.
ఆ తర్వాత చూసావా ఎలా చేసానోనని రామలక్ష్మితో శ్రీలత అంటుంది. నువ్వేం చెయ్యలేవు.. నీవి అన్ని మాటలే.. నావి చేతలు రేపు ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసా.. అసలు నువ్వు ఊహించలేవని శ్రీలత అంటుంది.ఆ తర్వాత అసలు అత్తయ్య ఏం చెయ్యాలి అనుకుంటుందని రామలక్ష్మి ఆలోచిస్తుంటే.. సీతాకాంత్ తన దగ్గరకి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |